రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కరిముల్లా ను సన్మానించిన “రూట” నాయకులు

0 13

కడప ముచ్చట్లు:

 

కడపజిల్లాలో నూతనంగా ఎంపికైన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కరిముల్లా ను కడప నగరం, నకాష్ లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఉదయం  రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. షాహిదుల్లా లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కొరకు ఎల్లవేళల పాటుపడే వ్యక్తి కరీముల్లా అనీ, ఆయనకు రాష్ట్ర స్థాయి చైర్మన్ హోదా రావడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు.*
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. షాహిదుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీ  నాయకులకు ఉన్నతమైన చైర్మన్ల పదవులు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు, ఉప ముఖ్యమంత్రి ఎస్. బి అంజాద్ బాష లకు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఆయ్యూబ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్, మస్తాన్ వలీ, సిరాజ్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఫక్రుద్దీన్, జావేద్, కడప నగర ప్రధాన కార్యదర్శి హిఫాజతుల్ల తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:”Route” leaders honoring State Warehousing Corporation Chairman Karimullah

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page