శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

0 8

శ్రీశైలం ముచ్చట్లు :

 

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ఇవాళ మంగళవారం ఉదయం  శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,58,811 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా…. ప్రస్తుతం ఇవాళ మంగళవారం ఉదయం   834.38 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా… ప్రస్తుతం 54.29 (25.16%) టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమగట్టు (తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా…. కుడి గట్టు (ఆంధ్రప్రదేశ్) జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Flood calm to Srisailam reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page