శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

0 8

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం కవచ ప్రతిష్ఠ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచ ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగిస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ఏఇవో   ర‌వికుమార్‌రెడ్డి, కంక‌ణ బ‌ట్ట‌ర్    బాలాజి దీక్షితులు, సూపరింటెండెంట్లు   వెంక‌టాద్రి,   కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   మునీంద్ర‌బాబు,   కామ‌రాజు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Armor prestige in the temple of Sri Govindarajaswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page