21న గులాబీ గూటికి కౌశిక్

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:

టీఆర్ఎస్‌లో చేరేందుకుపాడి కౌశిక్ రెడ్డి రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేపు అధికారికంగా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యామ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.ఈటలపై కీలక ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఏడున్నర ఏళ్లుగా మంత్రిగా పని చేసావ్ అని కానీ ఏనాడు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించ లేదని మండిపడ్డాడు. నియోజకవర్గానికి ఈటల ఏం చేశారని ప్రశ్నించారు. వ్యక్తిగత అభివృద్ధి తప్పా నియోజకవర్గానికి చేసింది శూన్యం అని, కౌశిక్ రెడ్డి ధ్వజ మెత్తారు. స్వప్రయోజనాల కోసం పాటుపడ్డావని ఆరోపించారు. ఈటల చేసింది ఏంటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈటల నన్ను చంపాలని చూశారు
హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాక ముందే స్థానికంగా రాజకీయ వాతావరణం అప్పుడే వేడిగా మారిపోయింది. రోజురోజుకు ప్రధాన రాజకీయ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన హత్యకు కుట్ర జరిగిందని, ఓ మంత్రి ఇలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ఈ తరహా వ్యాఖ్యలే కౌశిక్ రెడ్డి చేశారు. గతంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈటల రాజేందర్ తనను హతమార్చడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
2018లో మర్రిపల్లిగూడ అనే గ్రామంలో తనను చంపించే ప్రయత్నం చేసి ఈటల విఫలమయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనను హతమార్చడం సాధ్యం కాకపోయినా మాజీ ఎంపీటీసీ బాలరాజ్‌ను మాత్రం హత్య చేశారని ఆరోపించారు. ఇదీ ఈటల రాజేందర్ నేర చరిత్ర అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు, టీఆర్ఎస్‌లో చేరేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేపు అధికారికంగా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని స్పష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యామ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరతాన‌ని ఆయ‌న ప్రక‌టించా…

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Kaushik to Gulabi Gooty on the 21st

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page