ఆగస్టు 15 నాటికి 1.74 లక్షల గృహాలు బేస్మెంట్ లెవల్ పూర్తి కావాలి- కలెక్టర్ హరినారాయణన్

0 12

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు  జిల్లాకు కేటాయించిన 1.74 లక్షల గృహాలు జూలై 16 నుండి ఆగస్టు 15 నాటికి బేస్మెంట్ లెవల్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ హౌసింగ్ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వరతో కలిసి గృహ నిర్మాణాల పై సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు 3 వేల గృహాలు లక్ష్యంగా నిర్ణయించి ఒక నెల లోపు అనగా జూలై 16 నుండి ఆగస్టు 15 వరకు ఒక లక్ష ఇళ్లకు బేస్మెంట్ పూర్తి చేయాలన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏరియా కో ఆర్డినేటర్లు, మునిసిపల్ కమిషనర్లు గృహ నిర్మాణాల లబ్దిదారులకు బ్యాంక్ రుణాల మంజూరు పై శ్రద్ద పెట్టాలన్నారు. జియో ట్యాగింగ్ మ్యాపింగ్ రిజిష్ట్రేషన్ కూడా పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలు కావల్సిన మెటీరియల్స్ అన్ని లబ్యత ఉందని హౌసింగ్ అధికారులు మైక్రో స్థాయిలో సిద్దం చేసుకొన్న ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. సిమెంట్ గోదాములు ప్రతి మండలంలో ఏర్పాటు చేశామని, మండల స్థాయిలో ఎ.ఈ లు, డి.ఈ లు వేగవంతంగా పనిచేయాలని లక్ష్యాల మెరకు పునాధులు జరిగేలా చూడాలన్నారు. మదనపల్లి, జి.డి.నెల్లూరు, కుప్పం మండలాలలో బేస్మెంట్ స్థాయిలో ప్రతి రోజు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయకున్నారని, వారి పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మాట్లాడుతూ పి.డి.డి.ఆర్.డి.ఎ ద్వారా ఇప్పటి వరకు 3880 మంది లబ్దిదారులు రుణ సౌకర్యం పొందారని తెలిపారు. లేవలింగ్ డీ మార్కింగ్ డేటా మండల వారీగా తయారు చేయాలన్నారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ కింద బేస్మెంట్ పూర్తి అయిన 1320 గృహాలకు ఎస్టిమేట్ జనరేట్ చేయాలన్నారు. ఈ సమావేశానికి హౌసింగ్ పి.డి పద్మనాభం,, ఈ.ఈ సాయిరాం నాయుడు, డి.ఈ లు హాజరయ్యారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: Basement level of 1.74 lakh houses to be completed by August 15: Collector Harinarayanan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page