ఆనందయ్య ఆయుర్వేద మందు దివ్య ఔషధం  పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్

0 16

నెల్లూరు  ముచ్చట్లు :
కరోనా కష్టకాలంలో ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనా నియంత్రణకు దివ్యౌషధంలా పనిచేస్తుందని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  మురళీ మోహన్ రాజు పేర్కొన్నారు.బొనిగి ఆనందయ్య సేవా ట్రస్ట్ సౌజన్యంతో  పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని బుజబుజ నెల్లూరు లోని శివాజీ కాలనీ, రాజుల వీధి నందు ఆనందయ్య ఆయుర్వేద మందు ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ఆనందయ్య ఆయుర్వేద మందు దివ్య ఔషదంలా ఉపయోగ పడింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరుపేద దగ్గర నుండి ధనవంతుని వరకు ఎంతో మందికి ఉచితంగా మందు పంపిణీ చేసిన ఆనందయ్య ఎంతో అభినందనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మీడియా ఇంచార్జ్ దగ్గుపాటి రాధాకృష్ణ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు ఆనందయ్య ఆయుర్వేద మందు మనిషికి ఆయువుపట్టులా ఉపయోగపడింది అని ఆనందయ్య సేవలను కొనియాడారు. గతంలో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి బయటపడ్డామని, కరోనా వస్తుందని భయబ్రాంతులకు లోనుకాకుండా ధైర్యంగా మానవ మనుగడ సాధించాలని సూచించారు. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ ,పరిశుభ్రతతో కరోనాను తరిమి తరిమి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కె.లక్ష్మణరాజు, కె.జయరామరాజు, ఎస్. ప్రభాకర్ రాజు,కె.నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Anandayya Ayurvedic medicine is divine medicine
Pinakini Youth Welfare Association

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page