ఆ ఐదు జిల్లాల్లో వానలు

0 14

విజయవాడ  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ వర్షాల జోరు ఊపందుకుంటోంది. రుతుపవనాల రాకతో పల్లెలన్నీ వర్షపు చినుకుల్లో తడిసి ముద్దవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడొచ్చని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాబట్టి, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.ఇక, ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా 5 జిల్లాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించించారు
రాగాల 48 గంటల్లో వానలు
తెలంగాణ‌లో రాగ‌ల 48 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌తో పాటు రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.హైద‌రాబాద్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి చిరుజ‌ల్లులు కురుస్తున్నాయి. ఉప్ప‌ల్, అల్వాల్, రాజేంద్ర‌న‌గ‌ర్, కార్వాన్ ఏరియాల్లో ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది. బాచుప‌ల్లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు భారీ వ‌ర్షం కురిసింది.హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. నిన్న‌టి వ‌ర‌కు న‌గ‌రంలో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్ల తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది. జులై 20వ తేదీ వ‌ర‌కు 359.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఈ తేదీ వ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 210.9 మి.మీ. మాత్ర‌మే. ఐఎండీ డాటా ప్ర‌కారం.. జులైలో నెల‌లో 285.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, గ‌త ప‌దేళ్ల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Rains in those five districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page