ఇవాళ్టి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఒక్కోచోట ఒక్కో ధరను ప్రభుత్వం నిర్ణయించనుంది. ప్లేస్, ప్లాట్, మార్కెట్ ఆధారంగా కొత్త రేట్లు నిర్ణయం తీసుకోనుంది. గ్రామీణ, పట్టణ, కమర్షియల్ గా భూముల విభజన జరుగనుంది. శ్లాబుల వారీగా మార్కెట్ విలువలు ఫిక్స్ చేయనుంది. కనిష్టంగా 20శాతం, గరిష్టంగా 50శాతం పెరిగాయి.వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 50శాతానికి పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లకు కొత్త విలువలను నిర్ణయించింది ప్రభుత్వం. సవరించిన విలువలను సబ్‌ రిజిస్టార్లకు పంపి.. పూర్తిగా పరిశీలించి తర్వాతే ఖరారు చేసింది. వ‌సాయ భూముల విలువ‌లు మూడు స్లాబులుగా(50 శాతం, 40 శాతం, 30 శాతం) పెంచుతూ నిర్ణ‌యం వెలువ‌రించారు. వ్య‌వ‌సాయ భూముల క‌నిష్ట విలువ ఎక‌రాకు రూ.75 వేలు పెంపు. ఓపెన్ ప్లాట్ల విలువ‌ను మూడు స్లాబుల్లో(50 శాతం, 40 శాతం, 30 శాతం) పెంచారు. ఓపెన్ ప్లాట్ల క‌నీస ధ‌ర చ‌ద‌రపు గ‌జం రూ.100 నుంచి రూ.200 పెంపు. అదే అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విలువ‌ను చ‌ద‌ర‌పు అడుగుకు 20 శాతం, 30 శాతంగా పెంచారు. ఫ్లాట్ల క‌నీస విలువ చ‌ద‌ర‌పు అడుగుకు రూ.800 నుంచి రూ.వెయ్యికి పెంపు. భూముల విలువ‌ల‌కు సంబంధించిన‌ ఏవైనా స‌మ‌స్య‌ల‌పై సంప్ర‌దించాల్సిన టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1800 599 4788.

 

 

 

 

- Advertisement -

ఈమెయిల్ చిరునామా ascmro@telangana.govt.in.రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్‌లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువ‌ను పెంచింది.భూముల మార్కెట్ విలువల పెంపులో మార్పులు చేసింది. 6 నుంచి 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ భూముల విలువ 30 నుంచి 50 శాతం పెంచింది.వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75వేలు నిర్ణయించింది. ఓపెన్ ప్లాట్ కనిష్ట విలువ చదరుపు గజానికి రూ.200లు పెంచింది. అపార్ట్ మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.వెయ్యి పెంచింది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై ఇటీవలే కేబినెట్‌ సమావేశంలో చర్చించింది.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: New registration charges from today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page