కవితని కలిసిన టీబీజీకేఎస్ సోషల్ మీడియా యువ నాయకులు

0 7

పెద్దపల్లి  ముచ్చట్లు :
సింగరేణి కార్మికుల పదవి విరమణ వయోపరిమితి 61 సంవత్సరాలు పెంచుటకు ప్రత్యేక చొరవ తీసుకున్న కల్వకుంట్ల కవితని టీబీజీకేఎస్ సోషల్ మీడియా యువ నాయకులు బుధవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ లో సదరు విషయాన్ని ఆమోదించాలని సి.ఎం.డిని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి సింగరేణి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బొగ్గుగని  కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సిఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కలిసిన వారిలో యువ నాయకులు సాదుల సంతోష్, చేల్పూరి సతీష్, కట్కూరి రత్నాకర్ రెడ్డి, కాదాసి రమేష్ తదితరులు ఉన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:TBGKS social media young leaders who met the poem

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page