కుంద్రాకు బిగిస్తున్న ఉచ్చు

0 18

ముంబై ముచ్చట్లు:

 

 

అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంద్రాను అరెస్ట్ చేయడానికి ముందు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు 5 నెలల పాటు తీవ్రంగా శ్రమించి పక్కా ఆధారాలు సేకరించి మరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది. రోజుకు రూ.20 వేల చొప్పున ఒక బంగ్లాను అద్దెకు తీసుకుని అశ్లీల చిత్రాల చిత్రీకరణ జరిపేవారని, 20,25 ఏండ్లుగా సినిమా ఫీల్డ్‌లో కష్టపడుతున్న పలువురు బాధితులుగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తనను టార్గెట్ చేసి కాంట్రాక్ట్ సినిమాల్లో పనిచేయమని బలవంతం చేసేవారని ఒక నటి పోలీసుల ఎదుట వెల్లడించినట్లు సమాచారం. 2021 ఫిబ్రవరి 4 వ తేదీన రాజ్‌ కుంద్రాపై కేసు నమోదైంది. అయితే, పోలీసులకు కుంద్రాపై స్టేట్‌మెంట్‌ మినహా మరేమీ లేకపోవడంతో అప్పుడు అతడ్ని అరెస్ట్ చేయలేదు.మూడు రోజుల క్రితం మలాడ్ వెస్ట్‌లోని మాడ్ గ్రామంలో అద్దె బంగ్లాపై దాడి చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతనే రాజ్‌కుంద్రాను అరెస్టు చేశారు. రాజ్‌కుంద్రాపై అశ్లీల చిత్రాలు తీయడం, యాప్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు ప్రసారం చేయడం, షేర్‌ చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ బృందం ఐపీసీలోని 292, 293, 420, 34, ఐటీ చట్టంలోని 67, 67 ఏ, ఐపీసీ సెక్షన్ 420 నమోదు చేశారు. ఇప్పటివరకు 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కుంద్రా కార్యాలయం నుంచి పలు బ్యాంక్‌ అకౌంట్లు, మొబైల్‌ ఫోన్లు, అశ్లీల క్లిప్‌లను గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రూ.7.5 కోట్ల నగదును సీజ్‌ చేశారు.మలాడ్‌ వెస్ట్‌లోని మాడ్‌ గ్రామంలోని ఒక పురాతన బంగ్లాను అశ్లీల సినిమాల నిర్మాణానికి వేదికగా ఎంచుకున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ. 20 వేల చొప్పున అద్దె చెల్లించేవారు.భోజ్‌పురి, మరాఠీ చిత్రాల షూటింగ్ పేరిట తన నుంచి బంగ్లాను అద్దెకు తీసుకున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. షూటింగ్ సమయంలో బంగ్లా యజమాని, ఇతర సిబ్బందిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదని పోలీసులు తెలిపారు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు బంగ్లాను అన్ని వైపుల నుండి నీలిరంగు తెరతో కప్పేవారని పోలీసులు గుర్తించారు.రాజ్‌కుంద్రా సినిమా నిర్మాణానికి ఉద్దేశించిన ప్రొడక్షన్ హౌస్ ముసుగులో పోర్న్ ఫిల్మ్ రాకెట్‌ను నడుపుతున్నట్లు తెలిసింది. అతడి సినిమాల్లో పనిచేసే అమ్మాయిలు, అబ్బాయిలలో ఎక్కువ మంది ఆర్థికంగా కష్టపడుతున్నారు. వారు 20 నుండి 25 సంవత్సరాల కళాకారులను ఎంచుకుని పనికానిచ్చేవారు. షూటింగ్‌కు ముందు తమ ఇష్టానుసారంగా నటిస్తున్నట్లు వారితో ఒప్పందంపై సంతకం తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.30 నుంచి 50 వేల వరకు ఇచ్చేవాడని పోలీసులు చెప్తున్నారు.
పోర్న్ గ్రఫి తీస్తే 5 ఏళ్లు జైలు…
బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోలు చేశాడ‌న్న కేసులో అరెస్ట‌యిన సంగ‌తి తెలుసు క‌దా. త‌మ‌తో అత‌డు పోర్న్ మూవీస్ చేసిన‌ట్లు ప‌లువురు యువ న‌టీమ‌ణులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ అత‌న్ని అరెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం అత‌డు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో అస‌లు పోర్నోగ్ర‌ఫీ గురించి భార‌త చ‌ట్టాలు ఏం చెబుతున్నాయి? అశ్లీల వీడియోలు తీయ‌డం, చూడ‌టం చ‌ట్ట ప్ర‌కారం నేర‌మా? రాజ్ కుంద్రా నేరం నిరూపిత‌మైతే ఎన్నేళ్ల శిక్ష ప‌డ‌నుంది?ఇండియాలో పోర్నోగ్ర‌ఫీకి సంబంధించి ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లో మూడు సెక్ష‌న్లు ఉన్నాయి. 292, 293, 294. అంతేకాదు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం 2000లోని సెక్ష‌న్ 67ఎ కూడా అశ్లీల చిత్రాల‌కు సంబంధించిన‌దే. అయితే ఈ చ‌ట్టం ప్ర‌కారం ఇండియాలో పోర్న్ లేదా అశ్లీల కంటెంట్‌ను చూడ‌టం, చ‌ద‌వ‌డం నేరం కాదు. 2015 జులైలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్ర‌కారం.. ఇంట్లో నాలుగు గోడ‌ల మ‌ధ్య పోర్న్ చూడ‌టం అనేది చ‌ట్ట‌బ‌ద్ధ‌మే. ఇది నేరం కింద ప‌రిగ‌ణించ‌కూడ‌దు. కానీ ఆ వీడియోల‌ను తీయ‌డం, ప్ర‌చారం చేయ‌డం, పంపిణీ చేయ‌డం మాత్రం నేరంగా ప‌రిగ‌ణిస్తారు.సెక్ష‌న్ 292 అనేది అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వీటిని చేయ‌డం, పంపిణీ చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష‌, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇక సెక్ష‌న్ 293 అనేది ఇలాంటి అశ్లీల వీడియోలు తీయ‌డం వాటిని 20 ఏళ్ల‌లోపు యువ‌త‌కు పంపిణీ చేయ‌డానికి సంబంధించిన‌ది.
ఇక సెక్ష‌న్ 294 అనేది ప‌బ్లిగ్గా త‌మ చ‌ర్య‌లు, పాటల ద్వారా అశ్లీలాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం గురించి చెబుతోంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అశ్లీల పాట‌లు పాడ‌టం, ఉచ్ఛ‌రించ‌డం అనేది నేరంగా ప‌రిగ‌ణిస్తోంది. ప్ర‌స్తుతం రాజ్‌కుంద్రాపై ఈ మూడు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.ఒక వేళ ఇందులో మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు క‌నుక ఉంటే వేరే సెక్ష‌న్ల కింద కూడా కేసులు న‌మోద‌వుతాయి.పిల్ల‌ల విష‌యంలో ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్ర‌మ్ సెక్సువ‌ల్ అఫెన్సెస్ (పోక్సో) చ‌ట్టం, 2012 కింద కేసు న‌మోదు చేస్తారు. ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం పోర్నోగ్ర‌ఫీలో పిల్ల‌ల‌ను భాగం చేయ‌డం నేరం. ఇక మ‌హిళ‌ల విష‌యంలో ఇన్‌డీసెంట్ రిప్ర‌జెంటేష‌న్ ఆప్ విమెన్ (ప్రొహిబిష‌న్) చ‌ట్టం ప్ర‌కారం కేసు నమోదు చేస్తారు. రాజ్‌కుంద్రాపై ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3, 4, 6, 7 కింద కూడా కేసులు న‌మోద‌య్యాయి.పోర్నోగ్ర‌ఫీ విష‌యంలో ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 67ఎను కూడా ప్ర‌యోగిస్తారు. అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం అనేది ఈ సెక్ష‌న్‌ కింద నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకూ జ‌రిమానా విధిస్తారు. రెండోసారి నేరం చేస్తే ఏడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధించ‌వ‌చ్చు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Trap tightening to Kundra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page