కోనసీమలో కరోనా విజృంభన

0 11

రాజమండ్రి  ముచ్చట్లు:

 

కోనసీమ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు  పెరుగుతుండంకలకలం రేపింది. పి. గన్నవరం, అల్లవరం, రాజోలు మండలాల్లో విస్తృతంగా కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే పి గన్నవరం మండలంలో ఉదయం 6 గంటలనుంచీ మధ్యహ్నం 2 గంటల వరకే బయటకు అనుమతి నిస్తున్నారు.  కోనసీమ పరిధిలో పలు చోట్ల కంటోన్మెంటు జోన్లు ఏర్పాటు చేసారు. రాజోలు మండలంలో రాజోలు, తాటిపాక, బి. సావరం గ్రామాల్లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మైక్ ల ద్వారా  విస్తృత ప్రచారం నిర్వహించాలని పంచాయతీ సర్పంచ్ లకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసారు. తగ్గుముఖం పట్టినట్టే పట్టి తిరిగి విపరీతంగా పాజిటివ్ రేటు పెరగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags; Corona boom in Konaseema

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page