గల్లంతైన మత్స్యకారులు క్షేమం

0 6

శ్రీకాకుళం  ముచ్చట్లు :
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం వున్నారని అధికారులు దృవీకరించారు. అండమాన్ తీరంలో బోటును గుర్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి,  అధికారులకు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ధన్యవాదాలు తెలియజేపారు. ముఖ్యమంత్రి  ఆదేశాలతో అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ని సమన్వయం చేసుకొని నిన్నటి సాయంత్రం నుండి గాలింపు చర్యలు ముమ్మరం చేయగా నిన్న రాత్రి అండమాన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఆ బోటును గుర్తించామని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ బోటును మరొక బోట్ సాయంతో ఈ రోజు సాయంత్రానికి చెన్నై తీరప్రాంతానికి తీసుకొని వస్తున్నట్టు, బోటులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించే నాయకుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అని ఇది అనేక సందర్భాలలో రుజువైందని, పాకిస్తాన్ లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించి సందర్భంలో కానీ… బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించి సందర్భంలో గానీ… మత్స్యకారులకు ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలిగిన తక్షణమే స్పందించే ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల అదృష్టమని, మత్స్యకారుల కష్టాలు తెలిసిన  వాడు, మత్స్యకారుల జీవితాలు అభివృద్ధి చేయాలన్న గట్టి తలంపుతో ఉన్న నాయకుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. అలాగే విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేసి బోటును గుర్తించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి మత్స్యకారుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Welfare of stranded fishermen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page