గాల్లో తేలే రైళ్లు వచ్చేశాయి

0 21

బీజింగ్‌ ముచ్చట్లు :

 

చైనా 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్‌ రైలును లాంచ్‌ చేసింది. ఈ రైళ్లతో బీజింగ్ నుంచి షాంఘైకి వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పట్టనుంది. విమానం కంటే వేగంగా మాగ్లెవ్‌ రైలు వెళ్లనుంది. ఖింగ్దావ్‌లో చైనా ఈ రైలును అభివృద్ధి చేసింది. సాధారణ రైళ్లకు, మాగ్లెవ్‌ రైళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. కానీ ఈ మాగ్లెవ్‌ రైళ్లకు పట్టాలున్నా.. పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తుంది.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Floating trains arrived in Gallo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page