గులాబీ గూటికి కౌశిక్‌రెడ్డి

0 10

హైదరాబాద్‌ ముచ్చట్లు :

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గానికి చెందిన అనుచరులతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకునేలా కౌశిక్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కొందరితో ఫోన్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వారం క్రితం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Kaushik Reddy to Pink Gooty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page