చెరువును తలపిస్తున్న కౌతాళం బస్టాండ్

0 6

మురుగునీరు తో దుర్వాసన కలిగిస్తున్న బస్టాండ్

కౌతాళం     ముచ్చట్లు :

- Advertisement -

మండల కేంద్రంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ గుంతలతో, దుర్వాసన తో చెరువుల తలపిస్తుంది చెరువు అని పొరబడితే అంతే అది ఆర్టీసీ బస్టాండ్ స్థితి గతి ! మరమ్మతులకు నోచుకోని వైనం అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అని !టెండర్లు తో ఆర్టీసీ కి ఆదాయం ఉన్న మరమ్మతులు శూన్యం ప్రయాణికులకు అంత ఇంత కాదు ఇబ్బందులు ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లాలంటే ముక్కు ముసుకోవలసిందే కనీసం కూర్చొటానికి కూడ లేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం గమనార్హం !అధికారులు ,నాయకులు చూసి చడనట్టు వ్యవహరిస్తున్నారు. సీపీఎం,రైతు వ్యవసాయ ఉపాధ్యక్షులు మల్లయ్య, లింగన్న ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ప్రయాణికులు బస్టాండ్ లో పోవడానికి,కూర్చొటానికి ఇష్టం లేక అటోలపై మొగ్గుచూపుతున్నారు. ఆర్టీసీ ఇంత అస్తవ్యస్తంగా ఉన్న అధికారులు షాపుల వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.32 పల్లె గ్రామాలకు ఆర్టీసీ బస్టాండ్ ఉన్న ఒకటే లేకున్నా ఒక్కటే అని ప్రజలు వాపోతున్నారు. నీరు ఎక్కడికి పోలేక దుర్వాసన కలిగిస్తున్న మరమ్మతులు చేయలేక అధికారులు చోద్యం చుస్తున్నారని వాపోతున్నారు.రోజు పడుతున్న వర్షానికి నీరు నిలబడి పందులు విరవిహారం చేస్తున్నాయి ఎక్కడ అంటురోగలు వస్తాయనో ప్రయాణికులు, ప్రజలు బయన్దోళనలు గురవుతున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి మరమ్మతులు చేస్తారో లేదో వేచిచూడాల్సిందే అని వాపోతున్నారు.!

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Kautalam bus stand facing the pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page