జిల్లా రెవెన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ లకు రాష్ట్ర సమాచార కమీషన్ నోటీసులు

0 17

ఈ నెల 28న హాజరు కావాలని ఆదేశాలు

కరీంనగర్ ముచ్చట్లు :

 

- Advertisement -

కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ లకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ నోటీసులు జారీ చేస్తూ ఈనెల 28న కమీషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర & మానవ హక్కుల సంస్థ) ప్రెసిడెంట్ మంచికట్ల అనిల్ కుమార్ అప్పీల్ కు స్పందించిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఈ నెల 15వ తేదీతో ఒక ఉత్తర్వుల ప్రతిని జారీచేసింది.కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్నకొండ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తప్పులపై విచారణ చేయమని 2019 ఎన్నికల ముందు కరీంనగర్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, చొప్పదండి మండల అభివృద్ధి అధికారులకు ఫిర్యాదులు చేశారు.

ఇచ్చిన ఫిర్యాదులను పట్టించు కోకపోవడంతో  సంభందిత అధికారులవిచారణ వివరాల కొరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) సెక్షన్ 6(1), 19(1), 19(3) ల ప్రకారం ఆర్నకొండ గ్రామస్థులు, కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దరఖాస్తులను సమర్పించారు. సమాచారం ఇవ్వనందుకు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఎదుట పౌర, మానవ హక్కుల సంస్థ (కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్) అప్పీల్ చేసింది.అప్పీల్ స్వీకరించిన తెలంగాణ సమాచార శాఖ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ కేసు రిజిస్టర్ చేశారు.
జిల్లా స్థాయి అధికారి అయి వుండి, సమాచార హక్కు చట్టం అమలు లో నలుగురికి ఆదర్శం కావలసిన జాయింట్ కలెక్టర్ మొదటి అప్పీల్ కు సమాధానం ఇవ్వకపోవడం వల్ల ప్రజలకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) పైన నమ్మకం తగ్గుతుందని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు – ఆర్టీఐ సెక్షన్ 19(3) ద్వారా సమాచార కమీషన్ కు ఇచ్చిన అప్పీల్ లో పేర్కొన్నారు.

సరైన సమయం లోపు సమాచారం ఇవ్వనందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం రోజుకు రూ.250/- చొప్పున, రూ.25,000/- వరకు పౌర సమాచార అధికారి / అప్పీలేట్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్/ జిల్లా రెవెన్యూ అధికారులకు జరిమానా పడే అవకాశం తప్పకుండా వుందని విశ్లేషకులు తెలియజేసారు.భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులలో భాగంగా సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని పలువురు విశ్లేషకులు తెలిపారు. రహస్యం లేని సమాచారం కోసం – ప్రజా పాలన కోసం సమాచార హక్కు చట్టం ఉపయోగ పడుతుందని వారు అన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:State Information Commission Notices to District Revenue Officer, Joint Collectors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page