తిరుమలలో ఆకేషియా చెట్ల తొలగింపు

0 8

తిరుమల  ముచ్చట్లు :
వైకుంఠం తిరుమల…ఇక్కడ కొలువైన శ్రీనివాసుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం వస్తుంటారు. దేవుని దర్శనంతోపాటు, ఇట్టే కట్టిపడేసే ప్రకృతి రమణీయమైన దృశ్యాలు తిరుమల గిరుల సొంతం. టిటిడి పరిధిలోని శేషాచల అడవుల్లో కొండలవాలుగా పరచకుని ఉన్న పచ్చదనం, అహ్లాదకరమైన వాతావరణం మధురానుభూతిని మిగులుస్తుంది.శేషాచలం అడువులకు సంబంధించి టిటిడి పరిధిలో 3వేల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఇందులో అనేక రకాల మొక్కలు ఉన్నాయి. అయితే మొక్కల పెంపక విధానాల్లో తిరుమల తిరుపతి దేవస్ధానం ఇటీవలి కాలంలో అనేక మార్పులు తీసుకువస్తుంది.ఈక్రమంలోనే టిటీడీ పరిధిలోని 2వేల ఎకరాలలో విస్తరించి ఉన్న అకేషియా చెట్లును తొలగించాలని నిర్ణయించారు. తుమ్మ జాతికి చెందిన ఈమొక్క కారణంగా భూసాంద్రత దెబ్బతింటున్నట్లు స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు తన పరిశీలన ద్వారా నిర్ధారించింది. భూమిలో ఆమ్లాల శాతం ఈ మొక్కల కారణంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టిటిడి దృష్టికి తీసుకువెళ్లారు.తిరుమల గిరులపై పసుపచ్చని వర్ణపు పూలతో చూడటానికి ఆకర్షణగా ఉండే ఈ అకేషియా తుమ్మ చెట్లను విడతల వారిగా తొలగించి వాటి స్ధానంలో జీవ వైవిధ్యానికి నష్టం కలిగించని మొక్కలను నాటాలన్న ప్రణాళికలను టిటిడి రూపొందించింది. పదేళ్ళలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. తొలగించనున్న అకేషియా చెట్ల స్ధానంలో స్వామి కైంకర్యాలకు ఉపయోగించేందుకు వీలుగా శ్రీగంధంతో పాటు ఇతర చెట్లను నాటనున్నారు. ఇప్పటికే 10 రకాలకు పైగా మొక్కలను ఎంపిక చేసి ఉంచారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Removal of acacia trees in tirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page