నిండుప్రాణం తీసిన పోడు వివాదం..

0 27

పోరాడలేక తనువు చాలించిన పోడు రైతు

భద్రాద్రి కొత్తగూడెం   ముచ్చట్లు :
పోడు వివాదం ఓ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది , పోడు చేసుకున్న భూమిని కోల్పోయిన  గిరిజన రైతు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.తాను సాగు చేసుకుంటున్న పోడుభూమిలో వేరే వ్యక్తులు విత్తనాలు వేయడంతో వారితో పోరాడి ఓడిన సురేష్ ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితుల్లో తనువు చాలించాడు.

- Advertisement -

పినపాక మండలం మల్లారంలో ఆదివాసీ గూడెంలో జీవనం సాగిస్తున్న వలస గిరిజనుడు కుంజా సురేష్ తను పోడు  వ్యవసాయం చేసుకుంటున్న 2 ఎకరాల పై స్థానిక గిరిజనులు కన్నేశారు. రెండు మూడు దఫాలు చర్చలు జరిపి ఆ భూముని తమదేనని ఆ భూమిలో విత్తనాలు చల్లారు.వలస గిరిజనుడు కావడంతో తన భూమిని ఆక్రమించిన  వారితో పోరాడలేకపోయాడు. కొన్నేళ్లుగా కష్టపడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్న భూమి కళ్ళముందే ఇతరుల పాలవుతుంటే తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డాడని మృతి ని బంధువులు ఆరోపిస్తున్నారు..  మృతుడు సురేష్ కి భార్య నలుగురు పిల్లలు ఉన్నారని , అతని కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పినపాక తహశీల్దార్ సురేష్ దహన సంస్కారాలకు పది వేల రూపాయలు సహాయం చేసారు.. అయితే విచారణకు వచ్చిన ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ సూరి మృతుని కూతురు లలితను దత్తత తీసుకుంటానని , ఆమె ఉన్నత చదువులు, ఇతర ఖర్చులు బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు.. మానవత్వం చాటిన ఎస్ ఐ ని  పలువురు అభినందించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Controversy over full life ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page