నూతన ఏఎంసి చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్ లకు ఆనం అభినందన

0 9

నెల్లూరు  ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా, రాపూరు మార్కెటింగ్ చైర్మన్ మరియు సైదాపురం పిఎసిఎస్ చైర్మన్గా ఎన్నిక కాబడిన నోటి రమణారెడ్డి, కరణం శ్రీనివాసులు నాయుడు ను అభినందించారు.
రాపూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పునర్నియామకం కాబడిన నోటి రమణారెడ్డి మరియు సైదాపురం పి ఎ సి ఎస్ నూతన అధ్యక్షులు గా  నియమించబడిన  కరణం శ్రీనివాసులునాయుడు.. నెల్లూరులోని “ఆనం నివాసం” వద్ద మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి కి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూల బొకేలు, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి  వారిని అభినందిస్తూ రైతు సమస్యల పరిష్కారం పై నూతన కమిటీలు మరింత సమర్ధవంతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అయితే  గ్రామాభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పుటకు రైతులే నిదర్శనమన్నారు. అటువంటి రైతులను వారి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాల సహకారం అభినందనీయమన్నారు. రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Congratulations to the new AMC Chairman and PACS Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page