పంచాయితీల్లో వనాలు

0 7

నల్లగొండ ముచ్చట్లు:

 

ఫ్రతి ఊరిలోనూ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందకు సన్నాహాలు జరుగుతున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తంగేడు వనం స్ఫూర్తితో ఈ చిట్టడవుల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ప్రతి గ్రామంలోనూ కనీసం ఎకరం స్థలంలో ఈ వనం ఏర్పాటు చేసేందుకు కసరత్తు సాగుతున్నది.ప్రజలందరికీ సాయంత్రం, ఉదయం పూటల్లో ఆహ్లాదం పంచేలా ఉండేందుకు ఊరి పక్కనే ఉండే అనువైన భూములను ఎంపిక చేయనున్నది. ఇప్పటికే పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై అటవీ శాఖ అధికారులకు శిక్షణ మొదలైంది.గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న భూములు, ప్రభుత్వ భూములు, ఏదైనా సంస్థకు చెందిన ఖాళీ స్థలాలుంటే వాటిలో భూమి లభ్యతను బట్టి కనీసం ఎకరం భూమిని అధికారులు గుర్తించనున్నారు. ఎక్కువ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే వనం విస్తీర్ణాన్ని పెంచుకునే వెసులుబాటును పంచాయతీలకు అధికారులకు కల్పించారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఊరి పక్కనున్న ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం కసరత్తు జరుగుతున్నది. పల్లె ప్రకృతి వనం ముఖ్యంగా ఏడు లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లనున్నారు. తక్కువ స్థలంలో స్థానికంగా ఏపుగా పెరిగే చెట్ల జాతులకు చెందిన మొక్కలను నాటనున్నారు. మొత్తం మూడు స్థాయిలలో మొక్కలను నాటుతారు. ఆహ్లాద పూరితమైన వాతావరణం సృష్టించడం ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా భూసారాన్ని పెంపొందించాలి.

 

 

 

 

- Advertisement -

నీటిని సంరంక్షించే పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ఈ వనాలు కీలక భూమిక పోషించనున్నాయి. వీటి పెంపకంలో పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడనున్నారు.ఈ వనాల చుట్టూ కందకాలు తొవ్వి లోపలి వైపు నిమ్మగడ్డి, వట్టి వేళ్ల గడ్డిని నాటుతారు. వెలుపలివైపు ముళ్లతో కూడిన గచ్చకాయ, గోరింటాకు మొక్కలను గ్రీన్‌ ఫెన్సింగ్‌ కోసం వాడనున్నారుఎంపిక చేసిన భూమిలో 0.23 ఎకరాలలో చిట్టడవిని ఏర్పాటు చేయనున్నారు. 0.22 ఎకరాలలో ఎత్తుగా పెరిగే నీడ నిచ్చే చెట్లను ఎంపిక చేసి పెంచుతారు. 0.19 ఎకరాలు మధ్యస్థంగా పెరిగే మొక్కలకు, 0.16 ఎకరాలు చిన్న మొక్కలకు కేటాయిస్తారు. వనంలో 0.07 ఎకరాల ఖాళీ స్థలం, నడక బాట కోసం 0.13 ఎకరాలు వదిలేయనున్నారు. బయటవైపు ఎత్తయిన మొక్కలను ఎటూ మూడు మీటర్ల దూరంలో, మధ్యవరుసలో ఎటూ రెండు మీటర్ల దూరంలో, లోపలి వరుసలో ఎటూ ఒక మీటరు దూరం ఉండేలా మిగతా మొక్కలను నాటనున్నారు. ఈ చిట్టడిలో కనీసం 20 జాతుల మొక్కల ఉండేలా చూడనున్నారు. నడక బాటను పూర్తిగా చదును చేయనున్నారు. ఈ వనంలో నాలుగైదు చోట్ల బెంచీలను వేయనున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Forests in Panchayats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page