పవన్ కళ్యాణ్ ని చూడాలనే కోరిక తీరకుండానే కన్నుమూసిన చిన్నారి

0 7
నెల్లూరు ముచ్చట్లు:

- Advertisement -

బోన్ కాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి యశస్విని పవన్ కళ్యాణ్ మావయ్యని చూడాలనే చివరి కోరిక తీరకుండానే కన్నుమూసింది. ఈ సంఘటన నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని నెల్లూరు భగత్ సింగ్ కాలనీ లో జరిగింది. బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి యశస్విని సినీ నటులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మావయ్యను చూడాలనే కోరికతో ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు చెప్పగా తెలుస్తుంది. నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని బుజబుజ నెల్లూరు, భగత్సింగ్ కాలనీకి చెందిన చిన్నారి యశస్విని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్కు సంబంధించిన అనేక సినిమాలు చూడడంతో, ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని ఆమె తల్లిదండ్రులను స్నేహితులతోనూ చెబుతుండేది అని స్థానిక ప్రజలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తను నా చివరి కోరిక గా సినీ నటులు పవన్ కళ్యాణ్ మావయ్యను చూడాలని కలవరిస్తూనే కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు చిన్నారి కోరిక తీరకుండానే తుది శ్వాస విడవడం బాధాకరమని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. చిన్నారి యశస్వినీ  కన్నుమూయడంతో చిన్నారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Pawan Kalyan is a blind child who does not want to see

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page