పుంగనూరులో 147 మంది ఇంటర్ నేషనల్ కరాటే పోటీలకు ఎంపిక

0 139

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ఈనెల 17 18 19 వ తేదీలయందు గోవాల మేడగొన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో 147 మంది ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికైనట్లు కరాటే అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు . ఈ పోటీలు క్విట్ ఇండియా, కేల్ ఇండియా వారి ఆధ్వర్యంలో నేషనల్ యూత్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కరాటే పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 147 మంది కరాటే బాలబాలికలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. వీరిలో పుంగనూరు కరాటే బాలబాలికలు 20 మంది కరాటే పోటీలలో ప్రథమ ,ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో ఎన్నికైన వారు మలేషియా ,దుబాయ్ ,మాలదిస్ ,దేశాల్లో జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే పోటీలో పాల్గొననున్నారు. ఈ కరాటే పోటీలలో ముఖ్య రిఫరీలు, జడ్జీలుగా పుంగనూరు కు చెందిన కరాటే మాస్టర్ లు టీ మంజునాథ.సాయి తేజ నాయక్ .రెడ్డి మహేష్ . దివ్య వ్యవహరించారు.ఈ పోటీలలో కటా, కుమితే విభాగంలో ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న విద్యార్థిని,విద్యార్థులు శిరీష, జీనత్ కబ్జా , పావని , అక్షయ, సిరి, యశస్విని, ముద్ర, ప్రణీత, రెడ్డి మహేష్ , కుందన్ , వేద విహార్ రెడ్డి, గౌతమ్, ప్రవీణ్ కుమార్,సుదర్శన్ ,సాయి శశిధర్, వెంకటేష్, విష్ణు , జ్యోతి ఆదిత్య , మావిజ్, హరి సూర్య కటారి లు ఎంపికయినట్లు తెలిపారు. గోవాలో జరిగిన పోటీలకు చిత్తూరు జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Bakreed celebrations with devotion in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page