ప్రేక్ష‌కుల ఆద‌రణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న `నీడ‌, హీరో` చిత్రాల‌తో ఈ వారం `ఆహా` సంద‌డి

0 9

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హండ్రెడ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా` త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ప్ర‌తి వారాంతం ప్రేక్ష‌కుల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న `నీడ‌, హీరో` చిత్రాలు రెండు `ఆహా`లో విడుద‌ల‌వుతున్నాయి. `నీడ` సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. న‌య‌న‌తార‌, కూన్‌చ‌కొ బొబ్బ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించారు. అప్పు ఎన్‌.భ‌ట్టాతిరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జూలై 23న ఈ చిత్రంలో `ఆహా`లో విడుద‌ల‌వుతుంది. రిషబ్ శెట్టి  హీరోగా న‌టిస్తూ నిర్మించిన `హీరో` చిత్రం జూలై 24న `ఆహా`లో విడుద‌ల‌వుతుంది. గ‌న‌వి ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌మోద్ శెట్టి, ఉగ్రం మంజు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ఎం.భ‌ర‌త్ రాజ్‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
గొళ్లు కొరుక్కునేంత ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు క‌లిగించేలా రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ `నీడ‌`. ఓ మ‌హాన‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. నితిన్ అనే స్కూలుకు వెళ్లే పిల్లాడి కోణంలో ఈ సినిమాక‌థ‌ను వివ‌రించారు. అత‌ని చుట్టూ జ‌రిగిన ప‌లు హ‌త్య‌ల‌ను అత‌ను వివ‌రిస్తాడు. మేజిస్ట్రేట్ జాన్ బేబీతో స‌హా అంద‌రినీ ఆ క‌థ‌నాలు అబ్బుర‌ప‌రుస్తాయి. అయితే జాన్‌కు ఈ క‌థ‌ల మధ్య ఉన్న లింకులు ప‌ట్టుకోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం పట్ట‌దు. ఈకేసును చేధించ‌డానికి అత‌ను ఎలా ముందుకెళ‌తాడు?  అనేదే సినిమా. ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రోల‌ర్ కోస్ట‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించారు.

 

 

 

- Advertisement -

`హీరో` సినిమా విష‌యానికి వ‌స్తే యాక్ష‌న్‌, కామెడీ అంశాల మేళ‌వింపుతో రూపొందిన చిత్ర‌మిది. ఓ క్షుర‌కుడు ఓ ప్ర‌మాద‌కారి అయిన గ్యాంగ్‌స్ట‌ర్ ఇంట్లోని త‌న మాజీ ప్రేయ‌సిని క‌లుస్తాడు. వారిద్ద‌రూ ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌, అత‌ని అనుచ‌రుల‌ను ఎదిరించి ఇంటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చేసే ప‌నులు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వును తెప్పిస్తాయి. మ‌రి వారిని విధి ఎక్క‌డికి తీసుకెళుతుంది? అనేదే సినిమా. మంచి కామెడీతో ఈ చిత్రం మీ వారాంతాన్ని పూర్తి చేస్తుంద‌ని భావిస్తున్నాం
ఈ వారాంతాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుకోవాల‌ని మీరు భావిస్తే ఆహాలో విడుద‌లైన సై ఫై క్రైమ్ థ్రిల్ల‌ర్ కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్‌ను మీరు చూడాల్సిన ప్లే లిస్టులో చేర్చుకోవాల్సి ఉంటుంది. యూ ట‌ర్న్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప‌వ‌న్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌డం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి టైమ్ లూప్ అనే యూనిక్ పాయింట్‌తో రూపొందింది. ఇందులో అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. రీసెంట్‌గా ఆహాలో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇంకా ఈ ఏడాది క్రాక్‌, నాంది, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, లెవ‌న్త్ అవ‌ర్, ఇన్ ది నేమ్ ఆప్ గాడ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, ఒరిజిన‌ల్స్‌తో మిమ్మ‌ల్ని అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది `ఆహా`

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: This week, ‘Aha’ is buzzing with ‘Shadow, Hero’, which has received rave reviews from audiences and critics alike.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page