భక్తిశ్రద్దలతో బక్రీద్ పండుగ

0 11

రాజమహేంద్రవరం  ముచ్చట్లు :
రాజమహేంద్రవరం, జంపేట ఆజాద్ చౌక్ వద్ద ఉన్న లబాబీన్ లైన్ మసీదులో అధ్యక్షుడు హాబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా ముస్లీం సోదరులందరు ఈద్ నమాజ్ ను ఆచరించారు. త్యాగం అనే పదానికి సర్వ శ్రేష్టమైన ఉదాహరణను ఈ ప్రపంచానికి అందించిన గొప్ప పండుగ బక్రీద్ పండుగ అని ముస్లిం పెద్దలు తెలియజేసారు. మసీదు అధ్యక్షుడు హాబీ బుల్లా ఖాన్ మాట్లాడుతూ రాజమండ్రి నగర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో ముస్లింలందరూ ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ఈద్ నమాజ్ ను ఆచరించారని తెలియజేసారు.  ఇళ్ళవద్ద నమాజ్ ఆచరించే వారు సైతం కోవిడ్ నిబంధనలు అనుసరించాలని, పండుగలను సంతోషకరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.  మస్జిద్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. ప్రాపంచిక వ్యామోహం కంటే ఆ పరమాత్మునియందు సంపూర్ణ నిష్ఠతో, దైవభీతితో మెలగడమే ఒక ముస్లిం యొక్క ఈ అపర లోకాల సాఫల్య ఇహపరలోకాల సాఫల్య మార్గమని, పేదల ఇళ్లల్లో సంతోషాలు పంచడమే బక్రీద్ పండుగ యొక్క లక్ష్యమని, విరివిగా దానాలుచేస్తూ తనపర భేదం మరచి అందరితోనూ కలిసి జరుపుకునేదే నిజమైన పండుగ అనిఅన్నారు. మసీదు కమిటీ సభ్యుడు సయ్యద్ రబ్బానీ, ఇమామ్ హఫీజ్ నసీముద్దిన్, బడే భాష తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Bakrid festival with devotion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page