మండలంలో ప్రశాంతంగా  బక్రీద్ వేడుకలు

0 6

ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్న బక్రీద్ సంబరాలు

కౌతాళం  ముచ్చట్లు:

 

- Advertisement -

కౌతాళం మండలం లో  ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.  వివిధ గ్రామాలలో  మసీదులలో. ఈమమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రవక్త గురించి ఈ సందర్భంగా త్యాగాల పండుగ బక్రీద్ ..బక్రీద్’ పండుగ అసలు పేరు- ‘ ఈదుల్ – అద్ హా’ అంటే – “త్యాగాల ప్రతిఫలం  పండుగని పేర్కొన్నారు.ప్రతీ వ్యక్తి ప్రవృత్తిలో “దాన గుణాన్ని” “త్యాగనిరతిని” పెంపొందించటానికి  “త్యాగాల పండుగ  అని నిర్దేశించటం జరిగిందన్నారు. త్యాగాల పండుగ సంక్షిప్తంగా ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవ మార్గంలో చేసిన బలికి గుర్తు గా దైవ మార్గంలో ఒక గొర్రెనో, మేకనో,  లేక ఒంటెనో బలి ఇవ్వాల్సిందిగా నిర్దేశించటం జరిగింది. దానికి కారణం  ఆ బలి ఇవ్వగా వచ్చిన మాంసంలో మూడు భాగాలు చేసి ఒక భాగం బీదలకు పంచాలి తద్వారా ఎందరో ఆకలితో అలమటించే బీదలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. మరొక భాగం బంధువులు దగ్గరవారు ఇరుగుపొరుగు వారికి దానం చేసి మిగిలిన ఒక భాగం స్వయంగా తినటం కోసం అన్న ఉద్దేశంతో మాత్రమే!

 

 

 

అసలు బలి ఇవ్వాల్సినవి ఏమిటి?
ధర్మంలో ప్రార్ధన, ఉపవాసం, జంతు బలి ఇవ్వటం వగైరా క్రతువులు ఏదో పుణ్యం కోసం యాంత్రికంగా చేసుకుపోవటానికి నిర్ధేశించినవి కావు. కానీ, వాటి నిర్వర్తించటం ద్వారా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించి.. మంచిపనులు చేసే ప్రవృత్తిని జనింపజేయటమే!
అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యగలగాలి.అమితంగా ప్రేమించే వస్తువులను త్యాగం చెయ్యగలగాలి.అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాలను త్యాగం చెయ్యగలగాలి.ఈ విధంగా మనిషి అమితంగా ప్రేమించే పై వాటిని త్యాగం చెయ్యటంతో పాటు మనిషి.. ఇతరుల పట్ల ఉండే ఈర్ష్యా-ధ్వేషాలను బలి ఇవ్వాలి…

 

 

 

 

వదులుకోలేని బలహీనతలను బలి ఇవ్వాలి..చెడు కోరికలను, చెడు ఆలోచనలను బలి ఇవ్వాలని కోరారు. త్యాగనిరతిని వ్యక్తిత్వంలో కలిగి ఉన్నప్పుడే ఖుర్బానీ ఇవ్వటమనేప్రక్రియకు,సార్థకత,చేకూరుతుందని దైవమార్గంలో ఇచ్చే జంతు బలి (ఖుర్బానీ) అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ…ముస్లిం సోదరులకు మొహమ్మద్ ముత్తాలి, మౌళి సబ్ హుస్సేన్ వలి తెలియజేశారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Calm Bakrid celebrations in the zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page