రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

0 7

అమరావతి  ముచ్చట్లు :
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందన్నారు.  దీంతో రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో  పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.  ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు..

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Light to moderate rains in the next three days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page