రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కాకాణి శ్రీకారం

0 3

నెల్లూరు   ముచ్చట్లు :
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఆదోని గోవర్ధన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూములకు సంబంధించిన సమస్యలతో పాటు, అన్ని రెవిన్యూ సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు.
ప్రతి వారంలో ఒక రోజు మండల కేంద్రంలో, గ్రామాల వారీగా రెవిన్యూ సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తాం అని తెలిపారు.
రాబోవు 3 నెలల కాలంలో నియోజకవర్గంలోని చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు, రికార్డులలో పొరపాట్లు సరిదిద్ది ప్రజలు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేస్తామన్నారు .సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు, ఇతర సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, మండల రెవెన్యూ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు…

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:Kakani Srikaram for solving revenue problems

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page