రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా చ‌రిత కామాక్షి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌

0 8

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్ పై ర‌జ‌నీ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కిస్తున్న చిత్రం చ‌రిత కామాక్షి. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్ చేస్తున్నారు. చ‌రిత కామాక్షి అనే టైటిల్ తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డంతో పాటు రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రాబోతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే చ‌రిత కామాక్షి ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో లీడ్ పాత్ర‌లు పోషించిన న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద‌లు స్టిల్స్ తో పొయెటిక్ ఫీల్ వ‌చ్చేలా ఈ ఫ‌స్ట్ లుక్ ని డిజైన్ చేశారు ద‌ర్శ‌కులు స్త్రీ లంక చందు సాయి. యూత్ ఫుల్ ఆడియెన్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని సంపూర్ణంగా ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కించార‌ని నిర్మాత ర‌జ‌నీరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కానున్నాయి

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Romantic Intense Drama Biography Kamakshi First Look Release, Unexpected Response

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page