వంగపల్లిలో ఈటల పాదయాత్ర

0 10

కరీంనగర్ ముచ్చట్లు:

 

వంగపల్లిలో  బుధవారం నాడు ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమయింది.  మూడవ రోజు పాదయాత్రలో  మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, అశ్వద్ధామ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర, ధర్మా రావు, రావు పద్మ, మాజీ కార్పొరేటర్లు పాల్గోన్నారు. వర్షం కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో వంగపల్లి ప్రజలతో ఈటల సమావేశం అయ్యారు. ఈటెల మాట్లాడుతూ నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్నా. 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్నా.  మీరంతా నాతో ఉన్నారు. మా విద్యార్థులకి 5 వేల మంది చదువుకొనే లాగా విద్యా సంస్థలు కమలపూర్ లో ఏర్పాటు చేశానని అన్నారు.రాష్ట్రంలో చెక్ డాం లకు హుజూరాబాద్ నియోజకవర్గం ఆదర్శం. 32 చెక్ డాం లు మంజూరు అయితే 20 కట్టుకున్నం. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది.  స్వేచ్ఛ గౌరవం లేదు.  కెసిఆర్ అహంకారాన్ని గెలిపిస్తర లేదా ఆ అహంకారంతో బలి అయ్యే పేద ప్రజల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా?? అహంకారానికి ప్రజా గొంతుకకి మధ్యనే ఈ పోరాటమని అన్నారు.ధర్మం పాతర వేయవద్దనే ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్న. కులం పార్టీ కంటే జనం తో సంబంధం ఉంది. ప్రజలంతా అండగా ఉంటామని అంటున్నారు. మీ కష్టంలో సుఖంలో ఎప్పటికి మీతోనే ఉంటానని అన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Eeta Padayatra in Vangapally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page