‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం

0 15

సినిమా   ముచ్చట్లు :
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్”  “సింగిల్ క్యారెక్టర్ ”  “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు.
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్  బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి, పిఆర్ఓ రాజ్ కమల్.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

- Advertisement -

Tags:’105 Minutes’ Shooting begins

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page