5 బ్యాచ్ లుగా గ్రామపంచాయతీ సర్పంచులకు శిక్షణ

0 5

– జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లాలో ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు ఈ నెల 22 వ తేది నుండి 5 బ్యాచ్ ల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శేఖర్ బాబు  పేర్కొన్నారు. నెల్లూరులో ఈ మేరకు ఆయన సర్పంచుల శిక్షణకు సంబంధించి వివరాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.పంచాయతీ రాజ్ శాఖ  మరియు స్టేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆద్వర్యంలో ఒక్కో సర్పంచి కి  3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 937 మంది సర్పంచ్ లు ఎన్నికవ్వగా, వారిలో ఎక్కువ జనాభా ఉన్న 132 గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు విస్తరణ శిక్షణా సంస్థ, గుంటూరు జిల్లా బాపట్ల  నందు శిక్షణ ఉంటుందని తెలియజేశారు. మిగిలిన 805 మంది సర్పంచ్ లకు జిల్లాలో 5 డివిజన్ లలో గుర్తించిన వేదికలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లాలో కావలి డివిజన్ లోని సర్పంచ్ లకు ఆర్.యస్.ఆర్. ఇంటర్నేషనల్ హై స్కూలు, కావలి నందు, నెల్లూరు డివిజన్ లోని సర్పంచ్ లకు  హరిత టూరిజమ్ హోటల్, నెల్లూరు, గూడూరు డివిజన్ లోని సర్పంచ్ లకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, గూడూరు , ఆత్మకూరు  డివిజన్ లోని సర్పంచ్ లకు గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్, ఆత్మకూరు, నాయుడు పేట డివిజన్ లోని సర్పంచ్ లకు మహాత్మా గాంధీ ఎ.పి.బి.సి రెసిడెన్సియల్ స్కూల్, డి.వి. సత్రం నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకుగాను  20 మంది మాష్టర్ ట్రైనర్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Training for Gram Panchayat Sarpanches in 5 batches

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page