అధిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

0 13

-రాష్ట్ర ముఖ్య  కార్యదర్శి సోమేష్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీవర్షాల దృశ్యా జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు.  గురువారం భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా సీఎస్  మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో  వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.  ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉన్నతాధికారులను సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని,  పరిస్థితిని ఎప్పటికప్పుడు  సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు .ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను ,ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సిఎస్ సూచించారు.  వాగులు వంకలన్నీ ఉద్రుతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.

 

 

 

మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉదృతి పెరగనున్నదని  తెలిపారు.  రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలని సీఎస్ పిలుపునిచ్చారు.   మున్సిపల్, పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిదిలో పురాతన శిథిల భవనాలు, గోడలు కులే పరిస్థితులు ఉన్నట్లైతే,  వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా   ఉన్న  చెరువులు,  వివిధ ప్రాజేక్టుల కాల్వలు పూర్తి స్థాయిలో నీరు ఉన్నందున   చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు .    టెలీకాన్ఫరెన్సులో పాల్గోన్న  జిల్లా కలెక్టర్  జి.రవి  మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహాలు ఉన్నచోట ప్రయాణాలు చేయకుండా బ్యారేకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని  తెలపారు.   ప్రబుత్వం అందించిన సూచనలు పాటిస్తున్నామని  తెలిపారు. గత  2 రోజులుగా జగిత్యాల జిల్లాలో 50 ఎంఎం, 61 ఎంఎం వర్షపాతం నమోదయిందని  తెలిపారు. లోటతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించామని  కలెక్టర్  తెలిపారు.

 

 

 

అనంతరం జిల్లా కలెక్టర్ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు,  పోలీసు ఉన్నతాధికారులు, నీటిపారుదల అధికారులతో టెలీకాన్పరెన్సు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల  పై పలు సూచనలు చేసారు. భారీ  వర్షాల నేపథ్యంలో  జిల్లాలో   కలెక్టరేట్ లో   కంట్రోల్  రూం  ఏర్పాటు చేసామని, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే  08724- 222204 ఫోన్ నెంబర్ కు తెలియజేయాలని కలెక్టర్  తెలిపారు.  జిల్లా  అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో  హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయంతో పనులు చేయాలనీ ,సెల్ నెట్వర్క్ ఏరియాలో ఉండి, పవర్ బ్యాంకులతో అందుబాటులో ఉండాలని అన్నారు.  గ్రామలోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమైనట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.విద్యుత్  పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని,  విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మున్సిపాల్టీలు, పంచాయతిలలో పారిశుధ్యం పై  ప్రత్యేక శ్రద్ధ వహించాలని , జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్రైయిన్లను సాయంత్రం వరకు  క్లీన్ చేయాలని, అవసరమైన చోట అధికంగా  కార్మికులను ఏర్పాటు చేసి క్లీన్ చేయాలని,

 

 

 

 

డ్రైయిన్ నుండి వచ్చిన చెత్త సైతం  తరలించాలని  ఆదేశించారు. జిల్లాలో అత్యంత  భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని  లోతట్టు ప్రాంతాలను గుర్తించి,  అక్కడ ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, దీని కోసం  సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో  ఎలాంటి ప్రాణ, ఆస్థి మరియు జంతు నష్టం వాటిలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికాలను  ఆదేశించారు.ఈ టెలికాన్పరెన్సులోజగిత్యాల ఎస్పీ సింధూ శర్మ,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,రెవెన్యూ డివిజన్ అధికారులు,  తహసిల్దార్లు,  జిల్లా పంచాయతి అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఎస్సారెస్పీ  అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: Be alert for heavy rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page