ఆనందయ్య మందు పంపిణీలో పీఎంపీ, రూడ్స్ సేవలు అభినందనీయం.

0 8

-5 వ పట్టణ సి.ఐ.. పి రామకృష్ణ

నెల్లూరు ముచ్చట్లు:

- Advertisement -

కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని  నెల్లూరు 5వ పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అన్నారు. గురువారం స్థానిక వుడ్ కాంప్లెక్స్ లోని చెక్కపని చేసుకునే కార్మికులకు,     పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో   కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేసిన రోగ నిరోధక శక్తిని పెంపొందించే మందును ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య మందు పంపిణీలో పీఎంపీ,రూడ్స్ సేవలు ఎంతో అభినందనీయమని, మందుతోపాటు వ్యాక్సీన్ను వేయించుకోవాలని, మాస్క్లు ధరించాలని,  కనీసదూరం పాటించాలని,తరచుగా చేతులు శుభ్ర పరుచుకోవాలని ఆయన కోరారు . ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుందని దానిని నిరోధించేందుకు ముందుజాగ్రత్తలు అవసరమన్నారు. కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది,   మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులు చేస్తున్న సేవా అమోఘమని అన్నారు. ఎందరో  కరోనాకు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు   .   కరోనా పై వదంతులు నమ్మకుండా  అనుమానం కలిగితే వైద్యుల్ని సంప్రదించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా  మందును ఉచితంగా ప్రజలకు అందజేశారు  .

 

 

 

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యాదర్శి  జయప్రకాశ్ మాట్లాడుతూ కరోనా సమయంలో మృతిచెందిన వారికి సంతాపం తెలియజేశారు.ప్రజలు కరోనా వచ్చిన తరవాత బాధపడే కంటే ముందుగా అవగాహన కల్పించుకోవాలని అన్నారు.సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే  వైద్య పరీక్షలు చేయించుకోవాలని సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పరీక్షలు కూడా చేస్తున్నారని ఆయన అన్నారు .ప్రభుత్వం నిర్వహిస్తున్న విధులతో పాటు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమములో స్టేషన్ యస్.ఐ లక్ష్మణరావు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్,సభ్యులు జి.శేషయ్య,డి. శ్రీనివాసులు,రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్,సభ్యులు వసుందర, సుబాన్,రాజేష్,నారాయణ,మన్సూర్ పాల్గొన్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: PMP, Rudd’s services in Anandayya drug distribution are commendable.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page