ఆరు బయిట క్వశ్చన్ పేపర్లు

0 14

వరంగల్ ముచ్చట్లు:
రంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వాహకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎగ్జామినేషన్ కంట్రోలర్ కార్యాలయం ముందు సీల్డ్ కవర్స్‌లలో ప్రశ్నపత్రాలు లభ్యం కావడంతో హల్చల్ రేగింది. దీంతో అధికారుల నిర్లక్ష్య వ్యవహారం వెలుగు చూసింది. అసలు స్టోర్ రూమ్‌లో భద్రపర్చాల్సిన ప్రశ్నాపత్రాలను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసిన వైనం వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది వర్షంలో తడుస్తున్న ప్రశ్నపత్రాలను చూసిన వెంటనే వర్షంలో తడిసి ముద్దవుతుండడంతో పాలిథీన్ కవర్లు కప్పి తడవకుండా కాపాడారు.ఇంజినీరింగ్ పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలుగా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అయితే ప్రశ్నా పత్రాలు బయట ప్రత్యక్షం అయినట్లుగా విద్యార్థులకు తెలిసింది. ఈ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రశ్నపత్రాల పట్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పరీక్షలు నిర్వహించగా మిగిలిన పత్రాలను గురించి విద్యార్థులు అడగగా ఎగ్జామినేషన్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.కాకతీయ యూనివర్సిటీలో ఈ విధంగా ప్రశ్నపత్రాలు బయటపడటమే కాకుండా అధికారుల నిర్లక్ష్య వ్యవహారం గురించి కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జామినేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Six outside question papers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page