ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీరు

0 10

స్పందించిన కొణిదెల సర్పంచ్ కొంగర నవీన్
నందికొట్కూరు  ముచ్చట్లు:

నందికొట్కూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొణిదేల నందు గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతంలోని పంట పొలాల నుండి వచ్చే నీటితో పాఠశాల ప్రాంగణమంతా జలమయమైంది. ఈ పరిస్థితిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఎన్. హనుమంతరావు , కొణిదెల గ్రామ సర్పంచ్  కొంగర నవీన్  దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన తక్షణమే స్పందించి మినీ జెసిబి ద్వారా పాఠశాల ప్రాంగణాన్ని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో భారీ స్థాయిలో నిల్వ ఉన్న నీటిని కాలువ తవ్వించి బయటకు పంపే ఏర్పాటు చేయించారు. వెను వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా వర్షపు నీటిని శుభ్రం చేయించిన గ్రామ సర్పంచ్ నవీన్ కు పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ  బీ. నారాయణ రెడ్డి  ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్, ఉపాధ్యాయులు ఎల్లన్న, శివ ప్రసాద్ ఉపాధ్యాయినులు సిల్వియా రేచల్ ,నీరజ, రికార్డ్ అసిస్టెంట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Rainwater standing on the high school campus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page