ఉపాధికూలీలకు కవర్లు అందజేసిన సర్పంచ్

0 9

వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న శోభారాణీ

జగిత్యాల ముచ్చట్లు:
ఉపాధిహామీ పథకం కూలీలు వర్షంలో తడవకుండా ఉండేందుకు వారికీ కవర్లు అందజేసి ఉదరాతను చాటుకున్నారు జగిత్యాల జిల్లాలోని ఒక మహిళా సర్పంచ్ శోభారాణి.

- Advertisement -

వివరాల్లోకి వెళితే….
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో ఉపాధహామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వర్షాకాలంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల ఉన్న రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం గత కొన్నిరోజులుగా బతికేపల్లిలో సర్పంచ్ తాటిపర్తి శోభారాణి ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలు ఉద్యమంలా చేస్తున్నారు.
వర్షాకాలం కావడం గత మూడురోజులుగా తుఫాన్ ప్రభావం మూలంగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల పనులకు వచ్చే కూలీలు తడుస్తారని దాంతో జలుబు, జ్వరం వచ్చే అవకాశాలుంటాయని ముందుచూపుతో ఆలోచించిన సర్పంచ్ శోభారాణి వారికి కవర్లు పంపిణీచేసి మానవత్వాన్ని చాటుకున్నారు.గ్రామాన్ని పచ్చధనంతో నింపెందుకు , హరితహారం కార్యక్రమంలో భాగంగా  గ్రామం చుట్టూ నాలుగువైపులా ఉన్న రోడ్లకు ఇరువైపులా వేలాదిగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూలీలతో పాటు నీరుపొస్తు కంటికిరెప్పలా కాపాడేప్రయత్నం చేస్తున్నారు.  ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి పంచాయితీ కార్యదర్శితో కలిసి సర్పంచ్ శోభారాణి వెళ్లి తగు సూచనలు చేస్తూ పనులకు సహకరిస్తున్నారు.వర్షం పడుతున్న  మొక్కలు నాటడం, కంచెలు ఏర్పాటు చేయడం వంటి పనులకు ఆటంకం కలుగకుండా ఉoడడమే కాకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు దారులు తడవకుండా కూలీలకు వర్షం నుంచి రక్షణగా ఉండడానికి, సీజనలు వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్ శోభారాణి కవర్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈవిషయం పట్ల ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రజాప్రతినిధులు శోభారాణిని అభినందించారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Sarpanch handing out covers to employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page