ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లులు తప్పక ఇవ్వాలి

0 12

–  వ్యవసాయ అధికారి శివ శంకర్

 

మంత్రాలయం ముచ్చట్లు:

 

- Advertisement -

మందుల దుకాణాలలో రైతులు ఎరువులు మరియు  పురుగుమందులు  కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా కొనుగోలు బిల్లలు ఇవ్వాలి అని వ్యవసాయ అధికారి శివశంకర్ పేర్కొన్నారు .గురువారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు మరియు పెస్టిసైడ్స్ డీలరు ఓ ఫామ్  మరియు పీసీ లు తయారు చేసుకొన్న డీలర్లు  మాత్రమే రైతులకు పురుగుమందులు విక్రయించాలని తెలిపారు .నఖిలీ ఎరువులు నకిలీ పురుగు మందులు రైతులకు విక్రయిస్తే లైసెన్స్ క్యాన్సల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది రైతులు డీలర్లు రైతులకు కొనుగోలు చేసిన ఎరువులు మరియు పురుగు మందులకు కొనుగోలు   బిల్లులు ఇవ్వడం లేదని  రైతులు చర్చించుకుంటున్నారు అని అన్నారు. కాబట్టి డీలర్లు అందరూ రైతులకు వారు కొనుగోలు చేసిన వాటికి బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. బిల్లులు ఇవ్వలేని పక్షంలో డీలర్లకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు మాలపల్లి గ్రామంలో ఉరుకుందు ఈరన్న స్వామి ట్రేడర్స్ మరియు వైభవ్ ట్రేడర్స్ మందుల షాపులను తనిఖీ చేశారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags; Bills must be paid to every farmer who purchases fertilizer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page