ఎర్రకాలువ జలాశయం కాలువల ద్వారా నీరు  విడుదల

0 34

జంగారెడ్డిగూడెం  ముచ్చట్లు:
జంగారెడ్డిగూడెం మండల కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా దిగువకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతాంగానికి అనేక పథకాలు ప్రారంభించారని, వాటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జలాశయం లో నీరు పుష్కలంగా ఉండదని, సుమారు 15 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు జలాశయం నుండి నీటిని విడుదల చేయటం జరిగిందన్నారు. రైతులందరూ వ్యవసాయాన్ని పండుగ వాతావరణం లో చేసే విధంగా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. అనంతరం కాలువ ద్వారా విడుదల చేసిన నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జి, గురవైగూడెం గ్రామ సర్పంచ్ , వైసీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, గుబ్బల సత్యవేణి,అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర,  వైసీపీ నాయకులు మాల్నిడి బాబీ, బుడేకుల పాపారావు, సూరవరపు రాంబాబు, నెట్రు గణేష్, చైతన్య, రవిరాజు, ఇరిగేషన్ డి.ఈ విల్సన్, ఏ.ఈ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Red canal discharge of water through canals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page