ఐదు పైసలకే నోరూరించే బిర్యానీ.. !

0 13

మధురై ముచ్చట్లు :

 

బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజనప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్‌ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్‌ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్‌ కిటకిటలాడింది. మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్‌ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్‌ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్‌ ముందు వరుస కట్టారు. చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్‌ తాకిడిని తట్టుకోలేకపోయింది. 300 మందికి ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. అంతమంది తరలిరావడంతో యాజమాన్యం హోటల్‌ షట్లర్లు మూసేసింది.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Biryani that costs only five paise ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page