కనీసం మౌలిక సదుపాయాలు లేవు

0 11

ప్రజలు పన్నులు ఎందుకు కట్టాల
సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ డిమాండ్

నంద్యాల  ముచ్చట్లు:
పట్టణ శివారు ప్రాంతమైన నందమూరి నగర్ లోని మొదటి నీళ్ల ట్యాంకు ఎదురుగా 37 వ వార్డు లో రోడ్ల పైన వర్షపు నీరు మురికి నీరు నిల్వ ఉండడం వలన అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లపై నిలచిన నీటిలో చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేసినట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ నందమూరి నగర్ శాఖ కార్యదర్శి హుస్సేన్ సా సహాయ కార్యదర్శి టెంకాయల భాష కాలనీవాసులు ఇస్మాయిల్. డి మా భాష. ఈ సుబ్బు. జావిద్ . ఎస్ మా భాష తెలిపారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి .కె ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి నగర్ ఏర్పడి 40 సంవత్సరములు కావస్తున్నది కానీ  ఇంత వరకు అక్కడ అనేక ప్రాంతాలలో డ్రైనేజీలు లేవు.సిసి రోడ్లు లేవు .వీధిదీపాలు లేవు. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు పాములతో తేల తో దోమలతో ఇబ్బందులు పడుతూ ఉంటారని తెలిపారు. కానీ మున్సిపల్ అధికారులు ఈ సమస్యలను ఏమాత్రం పట్టించుకోరు కానీ వారికి పన్నులు మాత్రం కట్టాలి ఇదెక్కడి న్యాయం అన్నారు . 37 వ వార్డు లో ని మొదటి నీళ్ల ట్యాంకు ఎదురుగా వీధులలో  మురికి నీరు. వర్షపు నీరు. నిలువ ఉండడం వలన ఆ రహదారులలో మసీదుకు వెళ్లేవారు అక్కడ నివసించే వారు కాళ్లు పగుళ్లు వచ్చి పుండ్లు ఏర్పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక వెంటనే మున్సిపల్ అధికారులు అక్కడి సమస్యలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. లేనియెడల అక్కడి ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:At least there is no infrastructure

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page