కేసీఆర్ నిజం  ఒప్పుకున్నారు : సంతోషం

0 23

హైదరాబాద్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. దళిత బంధు పథకం విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీది ఫక్తు రాజకీయ పార్టీ అని ఒప్పుకున్నందకు సంతోషమని, ఎన్నికల్లో గెలవడానికి తప్ప ప్రజల అభివృద్దిమీద ప‌ట్టింపులేదని ఎద్దేవా చేశారు. జనాలను మోసం చేస్తున్నామని అంగీకరించారని, ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని షర్మిల పేర్కొన్నారు.ఎన్నికలు వస్తేనే మీ ప్రాంతాల్లో అభివృద్ది జ‌రుగుతుందని చురకలంటించారు. అభివృద్ది జ‌ర‌గాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించాలని, ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే మీ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి ప‌డుతుందని విమర్శించారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొత్త ప‌థ‌కాలు తెస్తారని, గెలిచాక వాటిని మూల‌న ప‌డేస్తారని షర్మిల ధ్వజమెత్తారు. ట్విట్టర్‌లో దళిత బంధు గురించి కేసీఆర్ మాటలను ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనాన్ని షర్మిల షేర్ చేశారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: KCR admitted the truth: happiness

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page