కోనసీమలో రెచ్చిపోతున్న నకిలీ అధికారులు

0 15

అమలాపురంముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సేల్స్ ట్యాక్స్ అధికారులమని  అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ముఠా గుట్టు రట్టయింది. సేల్స్ ట్యాక్స్ అధికారులమని చెప్పి లోడుతో వెళుతున్న వాహనాలనుఈ ముఠా ఆపి బెదిరించి సొమ్ములు దోచుకుంటుంది. దీంతో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై కేసు నమోదు అయింది. అమలాపురం నల్లవంతెన నుంచి ఈదరపల్లికి వెళ్లే బైపాస్ రోడు లో జూన్ 24న ముగ్గురు స్విఫ్ట్ కారులో వచ్చి  లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి ఈదరపల్లికి చెందిన డ్రైవర్ గూడపాటి స్వరూపకుమార్పై దౌర్జన్యం చేసి సేల్స్ ట్యాక్స్ అధికారులమని బెదిరించి అతడి జేబులో ఉన్న రూ.5 వేలు దోచుకున్నారు. స్విఫ్ట్ కారుపై సేల్స్ ట్యాక్స్ పేరుతో నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారు. వాహనం మళ్లీ అదే ప్రాంతంలో కనపడటంతో అనుమానం తో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు కాగితపల్లి శివన్నారాయణ, పాలగుమ్మి సూరిబాబు, కొప్పర్తి వీరషణ్ముకం దోపిడీలకు పాల్పడుతున్నారని గుర్తించి ముగ్గురు పై  కేసు నమోదు చేసారు. ఎవరైనా పోలీసులు, విలేకరులమని,వివిధ శాఖల అధికారుల మని చెప్పి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Fake officers provoked in Konaseema

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page