కోవిడ్‌ రోగి నుంచి వీర్యం సేకరణ

0 12

అహ్మదాబాద్‌ ముచ్చట్లు :

 

గుజరాత్‌లోని వడోదరలో కోవిడ్‌ కారణంగా పలు అవయవాలు దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉన్న ఓ వ్యక్తి నుంచి వైద్యులు వీర్యాన్ని సేకరించారు. వీర్యాన్ని తనకు ఇప్పించాల్సిందిగా ఆ వ్యక్తి భార్య హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఓకే చెప్పింది. వీర్య సేకరణకు వ్యక్తి అనుమతి అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియకు అనుమతి తెలిపే స్థితిలో రోగి లేనందున అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్‌ అశుతోశ్‌ జే శాస్త్రి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి నుంచి వీర్యం సేకరించినట్లు వైద్యులు తెలిపారు. కృత్రిమ పద్ధతిలో గర్భధారణ పొందేందుకు ఆమె తన భర్త వీర్యాన్ని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Semen collection from Kovid‌ patient

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page