గొర్రెల పంపిణీలో గొడవలు

0 4

కరీంనగర్  ముచ్చట్లు:
హుజురాబాద్ మండలం లోని శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో నిర్వహించిన రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌరసరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు హజరయ్యారు.  మంత్రులు రాకముందే నాయకులతో గొర్రెల కోసం గొడవకు  గొర్ల పెంపకం దారులు దిగారు. అధికారుల కమిషన్ కోసమే అంటూ ఇతర రాష్ట్రాలనుండి తెచ్చే సబ్సిడీ గోర్లు వద్దంటు అందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గోర్లు ఇక్కడి వాతావరణానికి తట్టుకోక చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేసారు. గొర్ల పంపిణీలో డాక్టర్లకే ప్రయోజనమెక్కువ  యాదవులు అంటున్నారు.  కొత్తగా డి డి చార్జీలు పెంచడంతో లాభం లేదంటున్న పెంపకం దారుల ఆవేదన పడ్డారు. రూ 12500 అదనంగా చెల్లించాలని అనడంతో ఆందోళన కు దిగారు.  ఇప్పటికే 31500 చెల్లించామని  గొర్ల పెంపకం దార్లు నినాదాలు చేసారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Conflicts in sheep distribution

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page