జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

0 1,219

పుంగనూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు, పుంగనూరు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు (57) ఆనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరులోని నివాస గృహంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే మదనపల్లె అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్నతో పాటు ఎంపీడీవోలు, జిల్లా అధికారులు సంతాపం తెలిపారు. ఈయన సతీమణి మదనపల్లె డిఎల్‌పీవో లక్ష్మీ, పిల్లలు ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: District MPDVola community leader Lakshmipathinayudu has died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page