టోక్యో ఒలింపిక్స్ అంతా సిద్ధం

0 25

టోక్యో ముచ్చట్లు:

 

లింపిక్స్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రీడా సంబురం. కానీ ఈ సంబురాన్ని నిర్వ‌హించాలంటే ఖ‌ర్చు కూడా త‌డిసి మోపెడ‌వుతుంది. నిర్వ‌హ‌ణ హక్కుల కోసం దేశాలు పోటీ ప‌డ‌తాయి. కానీ వీటిని నిర్వ‌హించిన త‌ర్వాత ధ‌నిక దేశాలు కూడా అప్పుల పాల‌వుతాయి. మ‌రో రోజులో ప్రారంభం కాబోతున్న టోక్యో ఒలింపిక్స్‌.. అస‌లు గేమ్స్ చ‌రిత్ర‌లో అత్యంత ఖ‌రీదైనవిగా నిలిచిపోనున్నాయి. గేమ్స్ నిర్వ‌హించ‌డానికి మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయ‌డానికి అయిన ఖర్చుతోపాటు గ‌తేడాది క‌రోనా కార‌ణంగా గేమ్స్ వాయిదా ప‌డ‌టం, ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో టోక్యో ఒలింపిక్స్ ఖ‌ర్చు భారీగా పెరిగిపోయింది.జపాన్ ప్ర‌భుత్వం ఈ గేమ్స్ కోసం 2013లోనే బిడ్ వేసి గెలిచింది. అప్ప‌ట్లో గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం 730 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.54 వేల కోట్లు) ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా వేశారు. నిజానికి అస‌లు బిడ్ దాఖ‌లు చేయ‌డానికే 10 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చ‌యింది. ఇక గ‌తేడాది గేమ్స్‌ను వాయిదా వేయ‌డానికి ముందు ఒలింపిక్స్ నిర్వ‌హణ కోసం 1260 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.93 వేల కోట్లు) ఖ‌ర్చ‌వుతాయ‌ని స‌వ‌రించిన అంచ‌నాల‌ను జ‌పాన్ విడుద‌ల చేసింది.

 

 

 

 

- Advertisement -

అయితే గేమ్స్ వాయిదా ప‌డ‌టం వ‌ల్ల జ‌పాన్‌కు అద‌నంగా 280 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చ‌య్యాయి. కానీ ఈ అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులై ఇప్పుడు మొత్తంగా ఖ‌ర్చు 3300 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.2.45 ల‌క్ష‌ల కోట్లు)గా ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.నిజానికి ఒలింపిక్స్‌లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించి ఉంటే దీని ద్వారా 80 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.6 వేల కోట్లు) వ‌చ్చేవి. కానీ క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కులు లేకుండానే గేమ్స్ నిర్వ‌హిస్తుండ‌టంతో ఆ మొత్తం టోక్యో ఒలింపిక్స్ క‌మిటీ న‌ష్ట‌పోయిన‌ట్లే. ఇక గేమ్స్ కోసం వివిధ ప్ర‌దేశాల్లో జ‌పాన్‌కు చెందిన 60 కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. వీటి ద్వారా 300 కోట్ల డాల‌ర్లు వ‌స్తాయి. ఇత‌ర స్పాన్స‌ర్లు మ‌రో 20 కోట్ల డాల‌ర్లు ఇస్తున్నారు. టీవీ హ‌క్కులు, స్పాన్స‌ర్‌షిప్స్‌, ఆతిథ్య రంగాల‌న్నీ క‌లిపి మ‌రో 200 కోట్ల డాల‌ర్లు కూడా వ‌చ్చాయి.ఒలింపిక్స్ వాటిని నిర్వ‌హించే క‌మిటీల‌కు లాభాలు తెచ్చిపెట్టాయి త‌ప్ప ఆతిథ్య దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను మాత్రం అత‌లాకుత‌లం చేశాయి. ఒక్క 1984 లాస్ ఏంజిల్స్ గేమ్స్ మాత్ర‌మే అమెరికాకు లాభాలు తెచ్చి పెట్టాయి. రియో, సోచి, ఏథెన్స్‌, మోంట్రియాల్ న‌గ‌రాలు గేమ్స్ నిర్వ‌హించిన‌ప్పుడు ఆయా దేశాలు దారుణ‌మైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.

 

 

 

 

ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. ఇప్పుడు జపాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా అందుకు భిన్న‌మేమీ కాదు.అమెరికా డాల‌ర్‌, యూరోల‌తో పోలిస్తే జ‌పాన్ క‌రెన్సీ యెన్ విలువ ప‌త‌న‌మ‌వ‌డంతో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు భారీగా పెరిగిపోయాయి. నేష‌న‌ల్ స్టేడియం, జిమ్నాస్టిక్స్ వేదిక‌ను రెనోవేట్ చేయ‌డం కోసం చేసిన దిగుమ‌తుల‌కు అంచ‌నాల‌కు మించి ఎన్నో రెట్లు ఎక్కువ ఖ‌ర్చ‌యింది. దీనికితోడు లేబ‌ర్ కొర‌త కూడా ఈ ఖ‌ర్చులు పెరిగిపోవ‌డానికి కార‌ణ‌మైంది. కొవిడ్ కార‌ణంగా అందుకు త‌గిన ఏర్పాట్లు చేయ‌డానికి జ‌పాన్‌కు అద‌నంగా 90 కోట్ల డాల‌ర్ల ఖ‌ర్చ‌యింది. ఇప్పుడు గేమ్స్ త‌ర్వాత అభివృద్ధి చేసిన మౌలిక స‌దుపాయాల నిర్వ‌హ‌ణ కూడా ఆ దేశానికి భారం కానుంది.

 

 

Tags: Prepare throughout the Tokyo Olympics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page