తిరుమల అర్చకులకు వంశపారంపర్య విధానం అమలు

0 10

అమరావతి ముచ్చట్లు :

 

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కూ వంశపారంపర్య అర్చకత్వ విధానాన్ని అమలుచేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు, ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల రిటైర్మెంట్‌ విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం విధానం సమర్థ అమలుకు సూచనలు ఇచ్చేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తుండగా, టీడీపీ హయాంలో దీనిపై అధ్యయనం ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంశపారంపర్య హక్కులు కల్పించింది.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Implementing the genealogical policy for Tirumala priests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page