తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

0 8

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణా రాష్ట్రంలో  రాగల మూడురోజుల వరకు  వాతావరణ సూచన,  హెచ్చరికలు జారీ చేసారు. గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం  దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పాడనుంది. ఈ అల్పపీడనంకు అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున  7.6 కి మీ ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి వుంది.  శుక్రవారం రాష్ట్రంలో   తేలికపాటి నుండి  మోస్తరు వర్షములు అనేక  ప్రదేశములలో మరియు ఎల్లుండి చాలా ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నాయి. అతి భారీ నుండి అత్యంత భారీ వన్షాలు తెలంగాణాలో కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం   వుంది. రాగల 2 రోజులు ఉరుములు , మెరుపులు మరియు ఈదురు గాలులు తో కూడిన వర్షాలు రాష్ట్రంలో  చాలా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Rains for two days in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page