నవజాత శిశువుకు ఆరుదైన సర్జరీ

0 4

హైదరాబాద్  ముచ్చట్లు:
అరుదైన వ్యాధితో బాధపడుతూ నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువుకు లోటస్ ఆసుపత్రి వైద్యులు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే నియోనటల్ లూపస్ కు గురై గుండె కొట్టుకోవడం తగ్గిపోయిన 8నెలల చిన్నారికి ఆసుపత్రి సిబ్బంది అరుదైన వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ లకిడికపూల్ లోటస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోటస్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. తల్లి నుంచి శిశువుకు వచ్చే ప్రతి ప్రొటీన్లు పుట్టబోయే శిశువుకు రక్తంలోకి బదిలీ అయ్యే క్రమంలో అవి అట్రియా లోని గుండె కండరాల ఫైబర్ లపై దాడి చేసి దెబ్బతీయడంతో గుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుందని అన్నారు. సాధారణ శిశువుల్లో నిమిషానికి 120 నుంచి 150 సార్లు గుండె కొట్టుకోవడం ఉండగా ఈ వ్యాధి ఉన్నవారికి 50 నుంచి 60 సార్లు మాత్రమే కొట్టుకుంటుందన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

- Advertisement -

Tags:Sixth surgery for newborn

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page