నా.. నీ ప్రేమ‌క‌థ` చిత్రం నుండి `చుప్ప‌నాతి పిల్ల` పాట విడుద‌ల‌.

0 22

హైదరాబాద్‌ ముచ్చట్లు:

కారుణ్య చౌద‌రి హీరో హీరోయిన్లుగా, అముద శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో పి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పోత్నక్ శ్రవ‌ణ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా.. నీ ప్రేమ‌క‌థ`. ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ నుండి `చుప్ప‌నాతి పిల్ల తిప్పుకుంటే ఎల్లా` సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎమ్ఎల్‌పి రాజా స్వ‌ర‌పరిచిన ఈ పాట‌కు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ప్ర‌వీణ్ కుమార్ ఆల‌పించారు. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా.. నిర్మాత శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ, “సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల్ని అల‌రించే అన్ని అంశాలూ ఈ మూవీలో ఉన్నాయి. త్వ‌ర‌లో అన్ని ప‌నులూ పూర్తిచేసి రిలీజ్‌కు సిద్ధం చేస్తాం” అన్నారు.
తారాగ‌ణం: నివాస్‌, కారుణ్య‌, అజ‌య్ ఘోష్‌, ఫిష్ వెంక‌ట్‌, ష‌ఫీ, బ‌స్‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మాధ‌వి.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: The song `Chuppannathi Pilla` has been released from the movie Na .. Nee Premakantha.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page